పలు రైళ్ల రద్దు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రద్దు

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్‌లో రీమోడలింగ్‌ పనుల నిమిత్తం మే ఒకటి నుంచి ఐదో తేదీ వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. మే 1, 2, 4 తేదీల్లో కాకినాడ టౌన్‌ – లింగంపల్లి (12775), 2, 3, 5 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్‌ (12776), మే 1న విశాఖపట్నం – చర్లపల్లి (18527), 2న చర్లపల్లి – విశాఖపట్నం (18528), ఒకటిన షాలిమార్‌ – చర్లపల్లి (08045), 2న చర్లపల్లి – షాలిమార్‌ (08046) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement