కులాలు, మతాల పేరుతో కుమ్ములాడుకుంటూ.. రక్త సంబంధాలు, కుటుంబ బంధాలను మరచి.. ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్న ప్రపంచమిది. అటువంటి మనుషుల కన్నా తామే నయమని నిరూపిస్తోందా వానరం. జగ్గంపేట బాలాజీ నగర్‌లోని చెట్లపై అప్పుడప్పుడు కోతులు నివాసం చేస్తూంటాయి. ఈ క్రమంలో సమీపంలోని ఇళ్ల మధ్య ఉంటున్న ఓ పిల్లి పిల్ల, ఓ ఆడ కోతి.. జాతి భేదాలను మరచి మసలుతూండటం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పిల్లి పిల్లను ఆడ వానరం చేతుల్లోకి తీసుకుంటూ, హృదయానికి హత్తుకుంటూ, ముద్దాడుతూ, మురిపిస్తూ లాలిస్తోంది. తప్పటడుగులు వేస్తున్న బిడ్డ పడిపోకుండా కాపాడుకునే కన్న తల్లిలా.. ఆ మార్జాలాన్ని సంరక్షిస్తోంది. తోటి వానరాల నుంచి ఎటువంటి హానీ జరగకుండా కాపాడుకుంటోంది. – గండేపల్లి


