సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు

Apr 20 2026 8:23 AM | Updated on Apr 20 2026 8:23 AM

అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో దేవస్థానంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగించే ఉత్సవ వాహనాలు, వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టిస్తున్నారు. కొండ దిగువన రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా రంగులు వేయించి ముస్తాబు చేయించారు. ఈ నెల 30న స్వామి, అమ్మవార్లను ఊరేగించే టేకు రథం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, ఇతర భవనాలు, వ్రత మండపాలకు రంగులు వేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, యనమల దివ్యలను దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం కలసి, స్వామివారి కల్యాణ ఆహ్వాన పత్రికలను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
Advertisement