ఈఓగా చక్రధరరావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఈఓగా చక్రధరరావు బాధ్యతల స్వీకరణ

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

అన్నవరం: వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 6 గంటలకు సత్యదేవుని దర్శించి, పూజలు చేసిన అనంతరం, ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఈఓ కార్యాలయంలో కూర్చుని ఆర్థికపరమైన ఫైల్స్‌పై సంతకాలు చేశారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధా నార్చకుడు కోట సుబ్రహ్మణ్య శర్మ, వ్రత పురోహి త సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సమన్వయంతో

శాంతిభద్రతల పరిరక్షణ

కాకినాడ రూరల్‌/కొత్తపల్లి: నగరంలో ఆరు పోలీ సు స్టేషన్లతో పాటు రెండు ట్రాఫిక్‌ స్టేషన్లున్నాయని, ఆయా స్టేషన్ల సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పని చేయాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌ తనిఖీకి వచ్చిన ఆయనకు రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వీరబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కేసులు, పరిష్కారం వంటి వాటిపై రికార్డులు తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాకినాడ నగరం, ఇంద్రపాలెం స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతలు బాగున్నాయన్నారు. స్టేషన్ల మధ్య పరిధి సమస్య వచ్చినపుడు తొలుత నమన్వయంతో సమన్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సూచించామన్నారు. జిల్లాలో హైవే పరిసరాల్లో గంజాయి పట్టుబడుతోందని, దీనిపై నిఘా ఉంచామని చెప్పారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కూడా నిఘా పెట్టామన్నారు. యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు అప్రమత్తగా ఉన్నారన్నారు. నగర భద్రతలో ఆటో డ్రైవర్లు, యజమానులను భాగస్వాములను చేసే ఆలోచన ఉందన్నారు. విశాఖ వైపు వెళ్లే హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్‌ కుమార్‌ చెప్పారు. కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంత మంది స్మగ్లర్లు బోట్లలో ఒడిశా వంటి ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెస్తున్నారని, మార్గం మధ్యలోనే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని చెప్పారు. పాత వారితో పాటు కొత్త నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ బిందుమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement