సాధారణ కుటుంబంలో పుట్టిన ఒంపోలు సత్య ప్రకాశిని కాకినాడ ఎంఎస్‌ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. ఫస్టియర్‌లో ఏకంగా 465 మార్కులు సాధించింది. ఆమె తల్లి కనకమహాలక్ష్మి గృహిణి. తండ్రి దుర్గాప్రసాద్ కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కుమార్తెను చదివిస్తున్నారు. హైస్కూలు విద్యను స్థానిక ఎస్‌ఎస్‌ఆర్‌కే మున్సిపల్ పాఠశాలలో చదివిన సత్య ప్రకాశిని గత ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో 577 మార్కులు సాధించింది. ఏమాత్రం ఒత్తిడి పడకుండా, నిరంతరాయంగా ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ ప్రోత్సాహం వల్లనే ఇంటర్‌లో మంచి మార్కులు సాధించానని ఆమె ఆనందంగా చెబుతోంది.
బైపీసీలో జిల్లా టాపర్
పిఠాపురం రూరల్: పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గంటా డెల్మా బైపీసీలో వెయ్యికి 985 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలిచింది.
ఫ గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొర్ర అనూష 987 మార్కులతో ప్రభుత్వ కళాశాలల నుంచి జిల్లా టాపర్‌గా నిలిచింది.


