‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ | - | Sakshi
Sakshi News home page

‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

కాకినాడ రూరల్‌: సర్పవరం జంక్షన్‌ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్‌ బ్రాంచ్‌ ఎదుట ఆ సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్పల సూర్య శంకరం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం విరమించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన దీక్షలకు అధికారులు స్పందించారు. జిల్లా సహకార అఽధికారి బి.శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న చర్యలను సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి త్రినాథరావుకు ఈ నెల 9న లేఖ ద్వారా వివరించి దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సిట్‌ దర్యాప్తుతో పాటు సీఐడీతో విచారణ చేయించిన విషయం తెలిసిందే. వయసు మీద పడి చాలా మంది డిపాజిట్లరు చనిపోతుండడంతో తక్షణ న్యాయం కోరుతూ సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చున్న పైడికొండల హనుమంతరావు, దేవికుమారిలతో సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు చర్చలు జరిపి ఒప్పించడంతో మధ్యాహ్నం దీక్షను విరమించారు. చైర్మన్‌ త్రినాథరావు మాట్లాడుతూ సొసైటీ బాధితులకు సాయం చేయాలని, ముందుగా రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఎంపీలకు, కలెక్టర్‌, తదితరులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీఓ తెలియజేయడంతో పాటు ఎండలో దీక్షలు వద్దని అభ్యర్థించిన మేరకు దీక్ష విరమింపజేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement