రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

Feb 4 2026 7:07 AM | Updated on Feb 4 2026 7:07 AM

రాష్ట

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

సమావేశంలో మాట్లాడుతున్న తోట నరసింహం

సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు వినతిపత్రం అందిస్తున్న తోట శ్రీరాంజీ

జగ్గంపేట: తమ పార్టీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం, దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం చూస్తూంటే రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నట్టుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట నరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయాలకు వాడుకోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు తక్షణం ఆపాలని హితవు పలికారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు నిరాధారమైన ఆరోపణలు చేశారని, తద్వారా వైఎస్సార్‌ సీపీని ప్రజలకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఆ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేసిన సీబీఐ సిట్‌.. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నిర్ధారించిందన్నారు. దీంతో కంగు తిన్న కూటమి నేతలు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రకు కూటమి నేతలు తెర తీశారని, తిరుపతిలో అపచారం జరిగిందంటూ వైఎస్సార్‌ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టి, రాద్ధాంతం చేసి, వైఎస్సార్‌ సీపీ శ్రేణులను రెచ్చగొట్టడం ప్రారంభించారని అన్నారు. తప్పుడు ఆరోపణలతో ఫ్లెక్సీలు పెట్టడాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, విడదల రజనీలపై దాడులకు తెగబడ్డారని, ఆస్తులు ధ్వంసం చేసి, యుద్ధ వాతావరణం సృష్టించడం దారుణమని మండిపడ్డారు. కళ్లెదుటే ఇంత జరిగినా దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితుల పైనే కేసులు పెట్టడం చూస్తూంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి ఎంతగా వత్తాసు పలుకుతోందో అర్థమవుతోందని చెప్పారు. ఇప్పటికై పోలీసులు నిజాయతీగా వ్యవహరించి, వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడులను అడ్డుకోవాలని, వారికి రక్షణ కల్పించాలని నరసింహం డిమాండ్‌ చేశారు.

లడ్డూపై నెహ్రూవి దిగజారుడు మాటలు

తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని ఓవైపు దర్యాప్తు సంస్థలు చెబుతూంటే మరోవైపు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ లడ్డూలో మరుగుదొడ్లు కడిగే యాసిడ్‌ వాడినట్లు తెలిసిందని చెబుతున్నారని, దీనినిబట్టి ఆయన ఎంతలా దిగజారి మాట్లాడుతున్నారో అర్థమవుతోందని నరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను భ్రష్టు పట్టించే వారు ఎంతటివారైనా ఆ ఏడుకొండల వాడు వదలడని, శిక్షించి తీరుతాడని అన్నారు.

సీఐకి వినతిపత్రం

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ నేతలపై జరుగుతున్న దాడులను తక్షణం నిలువరించాలని, తిరుమల లడ్డూ వివాదంలో నిరాధార ఆరోపణలతో వైఎస్సార్‌ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తోట శ్రీరాంజీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నేతలు రామకుర్తి జగాల్‌, జాన్‌వెస్లీ, గుర్రం మహాలక్ష్మి, పెద్దాడ రాజబాబు, రావుల గణేష్‌రాజా, భూమాడ గణపతి, సప్పా రఘు, కాపారపు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మీ రాజకీయాలకు

తిరుమలను వాడుకోకండి

ఫ తప్పుడు ప్రచారంపై

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

ఫ వాటిని వెంటనే కట్టిపెట్టండి

ఫ మాజీ మంత్రి తోట నరసింహం డిమాండ్‌

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది1
1/1

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement