ఆలిండియా పోటీలకు హేమశ్రీ | - | Sakshi
Sakshi News home page

ఆలిండియా పోటీలకు హేమశ్రీ

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

ఆలిండియా పోటీలకు హేమశ్రీ

ఆలిండియా పోటీలకు హేమశ్రీ

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఒడిశాలోని ఫకీర్‌ యూనివర్సిటీలో మార్చిలో జరగనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ తైక్వాండో పోటీలకు కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని హేమశ్రీ ఎంపికై ంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కందుల ఆంజనేయులు మంగళవారం తెలిపారు. తమ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హేమశ్రీ స్థానిక ఏఎస్‌డీ డిగ్రీ కళాశాలో జరిగిన ఆదికవి యూనివర్సిటీ అంతర్‌ కళాశాల ఎంపికల్లో బంగారు పతకం సాధించిందన్నారు. ఆమెను కళాశాల పీడీలు వర్మ, రమణ, దుర్గారావు, శ్రీను అభినందించారు.

1,780 కేజీల

రేషన్‌ బియ్యం స్వాధీనం

కొత్తపల్లి: మండలంలోని రమణక్కపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 1,780 కేజీల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రేషన్‌ బియ్యంపై పక్కా సమాచారం మేరకు ఎస్సై వెంకటేష్‌, తన సిబ్బందితో దాడి చేశారు. రమణక్కపేటలోని తాటాకు పాకలో గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్‌ నిల్వ ఉంచిన 1,780 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పిఠాపురంలోని పౌరసఫరాల గోడౌన్‌కు తరలించారు. శ్రీనివాస్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement