
కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అరకొర సౌకర్యాలు
జగ్గంపేట
ఎస్సీ హాస్టల్
విద్యార్థులతో
మాట్లాడుతున్న
చైతన్య
జగ్గంపేట: కూటమి ప్రభుత్వంలో హాస్టళ్ల విద్యార్థులు అరకొర సౌకర్యాలతో అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. జగ్గంపేట ఎస్సీ హాస్టల్‌ను బుధవారం సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కుళ్లిన కూరగాయలతో చేసిన కూరలు, బియ్యంలో పురుగులు, నాణ్యత లేని భోజనం పెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో హాస్టళ్ల విద్యార్థులు పౌష్టికాహారం తింటూ ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేవారన్నారు. ఈయన వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాని, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్, రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, ముమ్మిడివరం నియోజకవర్గం అధ్యక్షుడు ఆకాష్ ఉన్నారు.
వైఎస్సార్ సీపీ స్టూడెంట్
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు