
క్రెడిట్ టీడీపీదే అని వర్మ వ్యాఖ్యలు
ఉప్పాడ తీరంలో కోతకు గురైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, పాత మార్కెట్, కొత్తపట్నం తదితర ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.2,000 వంతున సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడకు వెళ్లే సరికి బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇద్దరు, ముగ్గురికి సాయంతోనే సరిపెట్టేశారు. ఆ సందర్భంగా వర్మ సముద్ర కోత నివారణ, రక్షణకు 2018లోనే చంద్రబాబు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదించారని చెప్పుకొచ్చారు. ఉప్పాడ వచ్చిన సందర్భంలో చంద్రబాబు, యువగళం పాదయాత్ర సందర్భంగా పెరుమాళ్లపురంలో లోకేష్ మత్స్యకారులకు ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు ఉప్పాడ కోతపై ఎప్పుడో దృష్టి పెట్టారని, ఆ క్రెడిట్ అంతా తమదేనన్నట్టు చెప్పుకున్నారు.