రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యువీ శివనాగబాబు తెలియజేశారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన బాడవుల కేదార్ మణికంఠ (21) రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం రాజమహేంద్రవరం నుంచి తన స్నేహితుడైన విష్ణువర్ధన్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో బిర్యాని తినేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని గండేపల్లి శివారుకు వచ్చేసరికి ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో కేదార్ మణికంఠకు తీవ్రంగాను, విష్ణువర్ధన్‌కు స్వల్పంగాను గాయాలుకాగా వీరిని రాజానగరం జీఎస్‌ఎల్‌కు తరలించగా అప్పటికే కేదార్ మణికంఠ మృతి చెందినట్టు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.


