పులుల ఖిల్లా.. నల్లమల | - | Sakshi
Sakshi News home page

పులుల ఖిల్లా.. నల్లమల

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

2,611.39 చ.కి.మీ.

విస్తీర్ణంలో అభయారణ్యం..

నల్లమల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ. అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ. బఫర్‌ జోన్‌గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వుగా ఏటీఆర్‌ నిలిచింది. ఈ అడవిలో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల రక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్‌ అభయారణ్యంలో ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200 పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది. సాధారణంగా పులులు రెండున్నరేళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఏటీఆర్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఆర్‌లో పరహా, భౌరమ్మ, తారా, ఎఫ్‌–53, ఎం–19, ఎఫ్‌–6, ఎఫ్‌–7, ఎఫ్‌–26 పేర్లతో ఆడ పులులకు నామకరణం చేశారు. ఒక్కో ఆడపులి సంవత్సరంలో నాలుగు పిల్లలను కంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పులులు ఏకాంతాన్ని కోరుకుంటాయని.. ఇదే సమయంలో ప్రసవిస్తాయని.. మూడు నెలలపాటు పర్యాటకుల రాకపోకలను నిలిపివేస్తుంటారు.

అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అఖిలభారత పులుల అంచనా–2026 ప్రకారం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌)లో వాటి సంఖ్య 36 నుంచి 42కు చేరిందని అటవీశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఇక్కడ 36 పులులు ఉండగా.. ఏడాది కాలంలో ఆరు పెరిగాయి. మొత్తం 18 ఆడ పులులు, 14 మగ, 2 ఉప–వయోజన, 8 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. తల్లి పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పునరుత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. 2017లో జాతీయ పులుల గణాంక అథారిటీ అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ ఆరు పులులుండగా.. ప్రస్తుతం 42కు చేరడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో మనుషుల సంచారం, ప్రవేశం తగ్గుతుందనేందుకు సూచన అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో నాలుగు, ఐదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గణన ఇలా..

ఏటీఆర్‌ పరిధిలో గత నవంబర్‌ నుంచి జూన్‌ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్‌లను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. ప్రతి బ్లాక్‌లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్‌తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్‌ను 2 చ.కి.మీ. గ్రిడ్‌లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్‌, రేక్‌ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్‌ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్‌ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది.

కెమెరాలతో నిఘా..

నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్‌వర్క్‌ నుంచి ఇంటర్‌నెట్‌కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్‌లు, 30 బేస్‌ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్‌, 350 కెమెరా ట్రాప్‌

లతో పులుల కదలి

కలను పర్యవేక్షిస్తున్నారు.

300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలు..

ఏటీఆర్‌లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పులులకు ఆహారంగా శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు గాను అటవీ ప్రాంతంలో 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్‌ పంపుసెట్లతో నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అక్రమ చొరబాట్లను నియంత్రించడం, వన్యప్రాణుల కదలికలపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. దీంతో చుక్కల దుప్పులు, సాంబర్‌, నీల్గాయి, జింకల సంఖ్య పెరిగింది. అడవిలో శాఖాహార జంతువులు పెరగడం.. పులులకు సరిపడా ఆహారం లభిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 180 చిరుతలు, 42 పెద్ద పులులు, 300 ఎలుగుబండ్లు, 12 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి.

పులి పిల్లలు 8

మొత్తం మగ పులులు 14

ఉపయోజన

పులులు : 2

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 42కు చేరిన పెద్ద పులులు

2024–25తో పోల్చితే ఆరు అధికం

గణనీయంగా పెరిగిన

ఆడ పులుల సంతతి

సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు

గుర్తింపు ఇలా..

పెద్దపులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్‌ల డేటాటేస్‌తో పాటు పులుల చారల ఆధారంగా మ్యాచ్‌ చేస్తారు.

మగ, ఆడ పులులను వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు.

పులులను గుర్తించాక, వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు.

ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు.

మనుషుల వేలిముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్‌ ప్యాటర్న్‌ ప్రతి పులికి ప్రత్యేకంగా ఉంటుంది.

ఆడపులులు

18

సంతానోత్పత్తి పెరిగింది..

అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా ముగిసింది. ఏటీఆర్‌లో మొత్తం 42 పులులు నమోదయ్యాయి. ఇక్కడ పులుల సంతానోత్పత్తి ఏటేటా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని ఇది సూచిస్తోంది. అటవీ అధికారులు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఏటీఆర్‌లో పులుల సంరక్షణ, శాసీ్త్రయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. – రేవంత్‌చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement