బతుకు.. భారం! | - | Sakshi
Sakshi News home page

బతుకు.. భారం!

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా టీసీసీఓ(టైపీస్ట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌)ల తొలగింపుతో వందలాది కుటుంబాల్లో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని సైతం తొలగించడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 73 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ.. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో టైపిస్ట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్లుగా వీరు సేవలందిస్తుండేవారు. ధరణి ప్రవేశపెట్టి భూ రిజిస్టేషన్లను తహసీల్దార్‌ కార్యాలయాల్లో చేయడం ప్రారంభించాగా కొత్తగా రిజిస్ట్రేషన్‌ విభాగంలో పని చేసేందుకు కంప్యూటర్‌ ఆపరేటర్లను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన తీసుకున్నారు. ఇటీవల గ్రూప్‌– 3 ,4 ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రతి తహసీల్దార్‌ కార్యాలయానికి నలుగురుకంటే ఎక్కువ మంది టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు వచ్చారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖలకు పంపించింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని జీపీఓలుగా తిరిగి తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించింది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయాల్లో కుల, ఆదాయ, స్థానిక, ఇతర ధ్రువపత్రాలు, రిపోర్టులు తయారు చేసేందుకు సరిపడా రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారి ఆవశ్యత అవసరం లేదని భావించిన ప్రభుత్వం వారిని మార్చి 31 తర్వాత పునరుద్ధరించవద్దని ఆదేశాలిచ్చింది.

పాత తేదీల్లో ఉత్తర్వులు..

సీసీఎల్‌ఏ ఉత్తర్వుల మేరకు టైపిస్టు కం కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్న 73 మంది టీసీసీఓలను మార్చి 31 తర్వాత రెన్యువర్‌ నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2026, మార్చి 31న జారీ చేసినట్లు వెలువరించడం శోచనీయం.

పెండింగ్‌లో ఏడు నెలల వేతనాలు..

ఉమ్మడి జిల్లాలో టీసీసీఓల విధుల పునరుద్ధరణను నిలిపివేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఏడునెలల వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కోసమో తమను బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

నారాయణపేట 13

గద్వాల 11

ఉమ్మడి జిల్లాలో 73 మంది టీసీసీఓలకు ఉద్వాసన

తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే వారిని తొలగిస్తున్నట్లు

ఉత్తర్వులు

గ్రూప్‌–3, 4 ఉద్యోగుల చేరికలు, జీపీఓల నియామకంతోనే..

నడి వయస్సులో ఉద్యోగ వెతలు

ప్రభుత్వ ఆదేశాల మేరకే..

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న టైపిస్టు కం కంప్యూటర్‌ ఆపరేటర్లు కొందరి వార్షిక రెన్యూవల్స్‌ను నిలిపివేశాం. ఇప్పటికే.. ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో రెగ్యూలర్‌ టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లను నియమించినందుకు వీరి అవసరం లేదని ప్రభుత్వం తొలగించినట్లుంది.

– భానుప్రకాష్‌, ఏఓ, వనపర్తి కలెక్టరేట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement