గద్వాల/గద్వాలవ్యవసాయం: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ.. అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల డివిజన్‌కు సంబంధించి యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి రైతు తమ మొబైల్‌లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్‌ను నివారించవచ్చన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని గంజిపేటలో కొలువుదీరిన పీర్లను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్, నాయకులు చంద్రశేఖర్, సత్యం, తుమ్మల నర్సింహులు, రాజేంద్ర, బంగి సుదర్శన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


