కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్‌కు చెందిన బి.అజిత్‌రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఫేసీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(ఎఫ్‌ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్‌రెడ్డి 2012 సివిల్ సర్వీస్‌కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్‌రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది.


