● 50 ఏళ్ల క్రితమే రిజర్వేషన్ ఫలాలు
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్: మొదటి నుంచి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర శుక్రవారం కొల్లాపూర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచందర్‌నాయక్, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్‌లతో కలిసి మంత్రి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితమే ఆదివాసీ, గిరిజనులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా సమాజంలో ఆదివాసీ గిరిజనులు అసమానతలకు లోనుకాకుండా ఉన్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి కృషిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.


