
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు
●
● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో
ఆందోళన
● 600 ఎస్‌ఎఫ్‌టీలలోపే అనుమతితో
పలువురు దూరం
● పక్కా ఇళ్లలో
అద్దెకున్న వారికి
వర్తించని పథకం
● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు
కేటీదొడ్డి మండలం ఇర్కిచేడుకు చెందిన పద్మమ్మ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమె ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. నివాసముంటున్న గుడిసె కూడా పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే పూర్తిగా కురుస్తుంది. కప్పుపై
కవర్ కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతుంది.
అద్దె ఇంట్లో ఉంటున్నాం..
మా ఇల్లు పాడుపడటంతో ఖాళీ చేసి.. అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతినెలా రూ. 5వేల ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా. సెంటు భూమి లేని మాకు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం అధికారులను అడిగితే మీకు ఇల్లు రాలేదని అంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న సొంతింటి కల కలగానే మిగిలింది.
– శ్రీధర్, ధరూరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు!