
మామిడి కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అంకిరావుపల్లి గ్రామ శివారులో ఉమ్మడి జిల్లాలోని మామిడి రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు మాట్లాడుతూ మామిడి కొమ్మల కత్తిరింపు, పునరుద్ధరణపై రైతులకు శిక్షణతోపాటు మామిడి కొమ్మలను కత్తిరింపు చూపించడం జరిగిందన్నారు. మామిడి కొమ్మలను కత్తిరించడం వల్ల దిగుబడి బాగా వస్తుందన్నారు. ప్రతి ఏటా ఆగస్టులోగా ఈ పద్ధతి పాటించాలని రైతులకు సూచించారు. మామిడి దిగుబడి రావాలంటే కొమ్మ కత్తిరింపు అనంతరం మొక్కకు కావాల్సిన సేంద్రియ, రసాయనిక ఎరువులను చెట్టు వయస్సు బట్టి వేసుకోవాలని చెప్పారు. కొమ్మల కత్తిరింపుతో గాలి, తేమ, సూర్యరష్మి తగిలి దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. అలాగే చీడపీడల బెడదను సమర్థవంతంగా నివారిచవచ్చున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉ ద్యాన అధికారి వేణుగోపాల్, వనపర్తి, గద్వాల, నా గర్‌కర్నూల్ జిల్లాల అధికారులు విజయభాస్కర్‌రె డ్డి, అక్బర్, వెంకటేశం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యాన శాస్త్రవేత్త హరికాంత్, పాలెం శాస్త్రవేత్తలు ఆదిశంకర్, శైల, ప్రసాద్, సీడ్ రిస్క్ మేనేజర్ భూపేష్‌కుమార్, ఇండియా గ్యాప్ సర్టిఫికేషన్ శ్రీహరి, ఉమ్మడి జిల్లా రైతులు పాల్గొన్నారు.