
మహిళా హక్కుల రక్షణకు ఉద్యమిద్దాం
గద్వాలటౌన్: దేశంలో మహిళా హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సీ్త్ర, పురుషులకు అనేక హక్కులను ప్రకటించినప్పటికి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. సీ్త్ర, పురుషుల మధ్య సమానత్వం లేదని.. విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సీ్త్రలు ఇప్పటికి వెనుకబడే ఉన్నారని చెప్పారు. చట్టరీత్యా హక్కులున్నా అవేవీ సీ్త్రలకు అందుబాటులో లేవన్నారు. వీటికి తోడు హత్యాచారాలు, వరకట్నపు మరణాలు, కుటుంబంలో హింస, బలవంతపు పెళ్లిలు, బాల్యవివాహాలు, బహు భార్యత్వం వంటి అనేక సమస్యలు సీ్త్రలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వీటిని అరికట్టేందుకు సమగ్రమైన ప్రతిపాదిత చట్టాలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సీ్త్ర విముక్తి అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద, కమిటీ సభ్యులు పద్మ, రత్నమ్మ, రాణి, సుధా, పద్మ, భాగ్యమ్మ, అమ్ములు, రాధా, కై యూమ్ తదితరులు పాల్గొన్నారు.