
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీనియోకాన్ఫరెన్స్ హాలులో ఇసుక బుకింగ్ విధానంపై రారష్ట్‌ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అవసరమైన ఇసుక సరఫరా కోసం తుమ్మిళ్ల ప్రాంతంలో ఒక ఇసుక రీచ్‌ను గుర్తించామని, రేట్‌చార్జ్‌ను సిద్ధం చేసి లబ్ధిదారుల జాబితాను త్వరగా ఇస్తే వారికి ఉచిత ఇసుకను వెంటనే పంపిణీ చేసేలా ప్రఽణాళిక చేశామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25క్యూబిక్ మీటర్ ఇసుకను అందించనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్లు, సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇసుక పక్కదారి పట్టకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్‌డీసీ శ్రీనివాస్‌రావు, హౌసింగ్‌పీడీ కాశీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.