
లక్ష్యం దిశగా ముందుకు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్‌లో గట్టుకు కాంస్య పతకం
గట్టు: దేశ వ్యాప్తంగా వెనుకబడిన మండలాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా మండలాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 500 మండలాలను ఎంపిక చేయగా, అందులో గట్టు మండలం కూడా ఉంది. ఈమేరకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. అధికారుల శ్రమకు తగిన ఫలితం లభించింది. 6 అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వాటికి ర్యాంకులు ఇవ్వగా.. గట్టు మండలానికి 5వ ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. దీంతోపాటుగా దక్షణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను జోన్ –3గా గుర్తించగా ఈ జోన్–3 లో గట్టు మండలం అభివృద్ధి సూచికలో 2వ ర్యాంకును సాధించింది.
నేడు రాజ్ భవన్‌లో అవార్డు అందుకోనున్న కలెక్టర్ బీఎం సంతోష్
6 అంశాలకు 3 అంశాల్లో వంద శాతం లక్ష్య సాధన
సంపూర్ణ అభియాన్‌లో అధికారుల సమష్టి కృషికి గుర్తింపు

లక్ష్యం దిశగా ముందుకు