నేడు అలంపూర్‌కు మంత్రుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు అలంపూర్‌కు మంత్రుల రాక

Jul 31 2025 7:06 AM | Updated on Jul 31 2025 8:30 AM

నేడు

నేడు అలంపూర్‌కు మంత్రుల రాక

అలంపూర్‌: జోగుళాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడంతోపాటు అలంపూర్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 31వ తేదీన గురువారం మంత్రులు పట్టణానికి రానున్నుట్లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, అనంతరం అలంపూర్‌ చౌరస్తాలో మహిళా సాధికారత, మహిళలకు వడ్డీలేని రుణాలు, రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తంగా ఉండండి

అయిజ: సీజనల్‌ వ్యాధుల భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఇంచార్జ్‌ డీఎంహెచ్‌ఓ సిద్దప్ప అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. డెలివరీ రూం, ఏఎంసీలను, ల్యాబ్‌ను, ఫార్మసీ గదిని పరిశీలించారు. మెడికల్‌ ఆఫీసర్‌లు విష్ణు, కిరణ్‌తో వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని, కుక్క, పాము కాటుకు మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పీహెచ్‌సీకి నలుగురు డాక్టర్లను ఏర్పాటు చేశామని, ఇన్‌ పేషంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సలహాలు చేశారు.

దండం పెడతా.. విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు

ఉండవెల్లి: విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దని.. వారికి నాణ్యమైన భోజనం అందించాలంటూ ఎమ్మెల్యే విజయుడు వంట సిబ్బందికి సూచించారు. మండలంలోని అలంపూర్‌ చౌరస్తాలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యేతోపాటు బీఆర్‌ఎస్‌వి జిల్లా కోఆర్డినేటర్‌ పల్లయ్య, పీఎసీఎస్‌ చైర్మన్‌ గజేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుగుల అన్నం, ఉప్పు నీటితో చారు చేసి ఇస్తున్నారని ఉపాధ్యాయులపై, రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అనేక సమస్యలున్నా నిధులు విడుదల చేయక ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే విద్యార్థులు రోడెక్కుతున్నారని అన్నారు. వంట గదికి వెళ్లి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని దండం పెట్టి వేడుకున్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాద్యక్షుడు దామర కిరణ్‌ సైతం పాఠశాలకు చేరుకొని భోజనాన్ని పరిశీలించారు.ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈదన్న, సింగరాజు మద్దిలేటి, శేషన్‌ గౌడు, తదితరులు పాల్గ్గొన్నారు.

నేడు అలంపూర్‌కు  మంత్రుల రాక  
1
1/1

నేడు అలంపూర్‌కు మంత్రుల రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement