
మెరుగైన వైద్య సేవలు అందించాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంచారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇక నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్ ఏర్పాటుకు రూ.2.65 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. రేడియాలజీ సేవల కోసం వచ్చే గర్భిణులు వేచి ఉండేందుకు సిటీ స్కాన్ బ్లాక్ వద్ద నూతనంగా రూ. 8.90లక్షలతో వెయింటింగ్ హాల్ నిర్మించామన్నారు. ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 300 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికి 550 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోంచి వచ్చే రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా వైద్యులు చూడాలని, సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, అభినేష్, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
జిల్లా ఆస్పత్రిలో రూ.3 కోట్లతో
అభివృద్ధి పనులు