
వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించం
గద్వాల క్రైం: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మానిటరింగ్ అధికారి ఫణిందర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, వైద్యుల పనితీరు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులు తదితర వివరాలను సూపరింటెండెంట్ ఇందిరతో తెలుసుకున్నారు. ప్ర సవాల కోసం వచ్చే గర్భిణులకు సాధ్యమైనంత వర కు సాధారణ ప్రసవం చేయాలని వైద్యులకు సూచించారు. అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్నిరకాల మందులను అందుబాటు లో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లో మందుల నిల్వ వివరాలను ఫార్మసిస్ట్‌తో తెలుసుకున్నారు. ప్రమాదకర వ్యాధులు, శస్త్ర చికిత్సల కోసం అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల కోసం సమర్పించిన నివేదికలపై ఆరా తీశారు. కాగా, టెక్నిషియన్ పోస్టు ల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశా రు. మానిటరింగ్ అధికారి వెంట సిబ్బంది కౌటిల్య, వేణుగోపాల్, శ్రీనివాసులు, అభినేష్, రాజు, మధుసూదన్‌రెడ్డి, వినోద్ తదితరులు ఉన్నారు.