రుణ లక్ష్యం ఖరారు | - | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యం ఖరారు

Aug 3 2025 3:28 AM | Updated on Aug 3 2025 3:28 AM

రుణ ల

రుణ లక్ష్యం ఖరారు

రూ. 2998.57కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్దేశం

రుణ లక్ష్యం

నెరవేరేలా చర్యలు.

పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలకై ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాము. ఇందులో బాగంగా ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాము.

– శ్రీనివాసరావు, ఎల్‌డీఎం

గద్వాలన్యూటౌన్‌: జిల్లాలో పంట రుణ లక్ష్యం ఖరారైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో 1,47,258 మంది రైతులకు రూ. 2998.57 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నడిగడ్డ రైతాంగం బ్యాంకులు అందించే రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. పండ్లతోటలు, కూరగాయలు కూడా పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుభరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నా.. వాటితో రైతలు అవసరాలు పూర్తిగా తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి సేద్యం చేస్తున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే అధిక వడ్డీలకు ప్రైవేటులో అప్పులుచేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

● ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు బ్యాంకులు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో బాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్‌ బ్యాంక్‌ అధికారులు రూపొందించారు. వానాకాలంలో 88,356 మంది రైతులకు రూ. 1798 కోట్లు, యాసంగిలో 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. దీన్ని కొన్నిరోజల క్రితం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆమోదించారు.

బ్యాంకుల వారీగా రుణ లక్ష్యం ఇలా (రూ.కోట్లలో)

వానాకాలంలో 88,356మంది, యాసంగిలో 58,902మందిరైతులకు ఆర్థిక తోడ్పాటు

లక్ష్యం నెరవేరితేనే ప్రయోజనం

రుణ లక్ష్యం ఖరారు 1
1/2

రుణ లక్ష్యం ఖరారు

రుణ లక్ష్యం ఖరారు 2
2/2

రుణ లక్ష్యం ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement