కనులపండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
మల్దకల్: మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కల్యాణోత్సవం ఆదివారం వేదపండితులు కుమారస్వామి, శివకుమార్ మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా సాగింది. ముందుగా స్వామి వార్ల ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు కల్యాణం నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, గద్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌అచారి, సంఘం నాయకులు బ్రహ్మయ్యచారి, ప్రభాకరచారి ముఖ్యలతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు మల్దకల్‌తో పాటు గట్టు, అయిజ, గద్వాల పట్టణాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య, మహేష్, బీష్మాచారి, వినోద్, రంగప్పచారి, శ్రీనివాసులు, కాలప్పచారి, నర్సింహచారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


