జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గట్టు ఆడపడుచు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గట్టు ఆడపడుచు

May 1 2025 1:27 AM | Updated on May 1 2025 1:27 AM

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గట్టు ఆడపడుచు

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గట్టు ఆడపడుచు

గట్టు: గట్టు చరిత్రలో తొలిసారిగా ఓ ఆడపడుచు జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన సంఘం స్వర్ణమల్లిక జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. బుధవారం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో గట్టుకు చెందిన స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన న్యాయవాది సంఘం సురేష్‌ కుమార్తెనే స్వర్ణమల్లిక. ఈయన గద్వాల కోర్టులో గత 30 ఏళ్లుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. స్వర్ణమల్లిక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గద్వాల సత్యసాయి విద్యామందిర్‌లో, ఇంటర్‌ను శ్రీమేధా హైదరాబాద్‌, డిగ్రీ శ్రీ చైతన్య ఐఏఎస్‌ అకాడమీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. న్యాయవాదిగా నమోదు అయిన తర్వాత కొంత కాలం గద్వాల కోర్టులోనూ, ఆ తర్వాత హై కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. స్వర్ణమల్లిక సోదరుడు సంతోష్‌ సైతం న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపిక కావడంపై గట్టు మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గద్వాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కావలి నర్సింహులు, కార్యదర్శి జయసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు ఖాజామోహినోద్దిన్‌, మాజీ అధ్యక్షుడు రఘురామిరెడ్డిలతో పాటుగా పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

జడ్జిగా ఎంపికై న తన కూతురు సంఘం స్వర్ణమల్లికతో సంఘం సురేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement