కొనుగోలు కేంద్రాలను సద్వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం మండలందిలోని కొండేరు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 17శాతం తేమ వచ్చేలా వడ్లను ఎండబెట్టాలని, తాలు, రాళ్లు, మట్టి పెల్లలు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు.


