కాంగ్రెస్‌ను ‘బంధువుల’ బెడద వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అఽభ్యర్థి కుటుంబ సభ్యుడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తి గతంలో హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో నయీం గ్యాంగ్‌తో కలిసి భూదందాలు, సెటిల్మెంట్లకు తెగబడినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వైరల్‌గా మారాయి. మూడేళ్ల క్రితం గట్టు మండలంలో పోలీస్ కేసు నమోదుకు సంబంధించి సీఐతో ఫోన్‌లో బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ దళితులను పరుష పదజాలంతో సదరు వ్యక్తి ఉచ్చరించిన విషయాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. నడిగడ్డపై నయీమ్ గ్యాంగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ కాగా.. కలకలం రేపుతున్నాయి.