ఏరియా స్పోర్ట్స్‌ క్రీడల కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఏరియా స్పోర్ట్స్‌ క్రీడల కమిటీ నియామకం

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలో 2026–27 సంవత్సరానికి వర్క్‌ పీపుల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌(డబ్ల్యూపీఎస్‌) క్రీడల కమిటీని గురువారం ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నియమించారు. స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌గా ఏరియాలోని కేటీకే ఓసీ–3కి చెందిన ఫిట్టర్‌ జి.నాగేశ్వర్‌రావు, జనరల్‌ కెప్టెన్‌గా కేటీకే–5వ గనికి చెందిన సీహెచ్‌ ప్రసాద్‌ను నియమించినట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్‌.శ్యాంసుందర్‌ తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.శ్యాంసుందర్‌, ప్రధాన సమన్వయకర్తగా పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యాంసుందర్‌, గౌరవ కార్యదర్శిగా సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ఎం.సాయికృష్ణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌లను నియమించారు. ఫుట్‌బాల్‌కు టి. పురుషోత్తం, హాకీ బి.విక్రమ్‌, క్రికెట్‌ పి.రాజు, కబడ్డీ టి.గణేశ్‌, వాలీబాల్‌ లక్ష్మణ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ టి.తిరుపతి, బాస్కెట్‌బాల్‌ ప్రణయ్‌, లాన్‌ టెన్నిస్‌ శ్రీరాములు, క్యారమ్‌ ఎంవీ.రావు, చెస్‌ జి.రాజ్‌కుమార్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆకుల శ్రీనివాస్‌ తదితరులు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement