భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి కే సాత్’ వర్చువల్ కార్యక్రమాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మోదీ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు సైతం సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ సురేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కవిత, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


