● డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్
భూపాలపల్లి రూరల్: మండల స్థాయి నుంచి గ్రామ, బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడితోపాటు మండల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడారు. సమావేశంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కటకం అశోక్, తాళ్లపల్లి భాస్కరరావు, పున్నం రవి, అనిల్, రఫీ, శీను, జాడి రాజయ్య, రాజేందర్, కృష్ణారెడ్డి, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.


