రేషన్‌ బియ్యం అమ్మితే కార్డు రద్దు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం అమ్మితే కార్డు రద్దు

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

రేగొండ: రేషన్‌ లబ్ధిదారులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం విక్రయిస్తే కార్డులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని పలుగ్రామాల్లో వీఓ బిల్డింగ్‌లకు శంకుస్థాపన, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని తెలిపారు. అలాగే మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కార్యక్రమంలో డీసీఎస్‌ఓ కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ బాలకృష్ణ, తహసీల్దార్‌ హేమ, ఎంపీడీఓ సురేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఓంప్రకాశ్‌, నాయకులు సంపత్‌రావు, కిష్ట య్య, మటికే సంతోష్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలి

ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టల వద్ద మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి.. మానవాళికి అమూల్యమైన వరమని, అడవులు వానవ జీవనానికి ప్రాణాధారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఎఫ్‌ఓ కిష్టగౌడ్‌, ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి అప్పలకొండ, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చంద్రమౌళి, సర్పంచ్‌ సుదర్శన్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement