భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సీఈఆర్ క్లబ్‌ను అభివృద్ధి చేసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలో సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులతో జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌లోని మౌలిక సదుపాయాల మెరుగుదల, అవసరమైన మరమ్మతులు, కొత్త సౌకర్యాల కల్పన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్లబ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అనంతరం సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులు జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి కృష్ణ, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతేల్లి మధుకర్‌రెడ్డి, సీఈఆర్ క్లబ్ సంయుక్త కార్యదర్శి కాపు చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్రీనివాస్, మధిర కొమరయ్య, క్రీడల కెప్టెన్ పాక శ్రీనివాస్, సాంస్కృతిక కెప్టెన్ అడిచెర్ల శ్రీనివాస్, శ్రీనివాసరావు, తాజుద్దీన్ పాల్గొన్నారు.
ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి


