దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరితగతిన పరిష్కారించాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకుని, వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, వారి వినతులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 27 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement