● కాంగ్రెస్ నాయకుడిపై రైతుల ఆరోపణ
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురైన భూనిర్వాసిత రైతులకు పరిహారం ఇప్పిస్తానంటూ 13మంది రైతు ల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడని కాంగ్రెస్ నాయకుడు లోకుల పోశంపై రైతులు ఆరోపించా రు. మంగళవారం కన్నెపల్లి పంచాయతీ వద్ద విలేకర్లతో బాధిత రైతులు మాట్లాడారు. 2020లో మేడిగడ్డ బరాజ్ బ్యాక్‌వాటర్ కారణంగా తమ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఎంజాయ్‌మెంట్ సర్వేలో భూములు ఉన్నట్లు చూపించి పరిహారం ఇప్పిస్తానని చెప్పి పోశం తమ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇప్పించకపోగా, తమ వద్ద తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడిగితే ఇప్పుడు ఇస్తా.. అప్పుడు ఇస్తా అంటూ కాలయాపన చేస్తున్నాడని తెలిపారు. సమస్యను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా.. మంత్రి సూచన మేరకు మహదేవపూర్ సీఐ సమక్షంలో పంచాయితీ నిర్వహించినా తమకు న్యాయం జరగలేదని రైతులు తెలిపారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. విలేకర్లతో మాట్లాడిన వారిలో ముంపు నిర్వాసిత రైతులు ముల్కల తిరుమల్, కావేరి సమ్మయ్య, కావేరి రాజయ్య, కా వేరి సురేష్, భూర్తి పెద్ద పోశాలు, భూర్తి మల్లయ్య, భూర్తి చిన్న సమ్మయ్య, భూర్తి మొండయ్య, కావేరి అంకయ్య, కావేరి తిరుపతి, కావేరి మారక్క, నలి మెల సారక్క, భూర్తి చిన్న పోచన్న పాల్గొన్నారు.
ఆరోపణలు అవాస్తవం..
ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నాయకుడు లోకుల పోశం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీ య కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. 13 మంది రైతుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశానన్న ఆరోపణల్లో వా స్తవం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో నీటి నిల్వపై ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే చర్యలు జరిగాయని, నీటి నిల్వ లేకపోవడంతో భూములు ముంపునకు గురికాక పరిహారం మంజూరు కాలేదన్నారు.


