భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం అమలును మరింత పటిష్టం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సమాచార హక్కు చట్టం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలుతీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సమాచారంలో మ రింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద అందుతున్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని తెలిపా రు. రికార్డులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించేందుకు అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాటారం ఆర్డీఓ రవీందర్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఆర్టీఐ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
డీఆర్వో వసంత కుమారి


