● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: మహోన్నత పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కేటీకే–5 ఇంకై ్లన్ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మున్సి పల్ చైర్మన్ బుర్ర కొమురయ్యతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికా రి ఇందిరా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.


