శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

రేగొండ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, వారికి సైన్స్‌పై ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, ఇన్‌స్పైర్‌ అవార్డు ఆన్‌లైన్‌, ఖాన్‌ అకాడమీ బుక్‌ ఆఫ్‌ డిజిటల్‌ లర్నింగ్‌ తదితర అంశాలపై ఒక రోజు ఓరిఝెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశోధన విధానాన్ని పెంపొందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎన్నుకుని విద్యార్థులచే ప్రాజెక్ట్‌ తయారు చేయించి జిల్లా స్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవేందర్‌, ఆర్పీలు ప్రవీణ్‌, సుమన్‌, సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు

పకడ్బందీ ఏర్పాట్లు

ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ బుధవారం ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలిపాడ్‌ పనులు, బారికేడ్లు, వీవీఐపీ వేచి ఉండే టెంట్‌, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్‌ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలాన్‌ నిర్మాణంతో పాటు ఇతర పనులను గడువులోగా పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ, వాహనాల పార్కింగ్‌ స్థలాలతో పాటు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్‌ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. హెలిపాడ్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఆలయ పరిసరాల్లో చేస్తున్న పనులను కలెక్టర్‌ సహదేవరావు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పోతో కలిసి వెళ్లి పరిశీలించారు. సీఎం గిరిజన సంప్రదాయాల ప్రకారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నందున ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లింపు తదితర కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గార్డెనింగ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌తో పరిసరాలను సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, డీఎస్పీ రవీందర్‌, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాల తనిఖీ

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో తనిఖీ చేశారు. పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించి విద్యార్థులకు స్పార్క్‌ ట్రైనింగ్‌పై అందుతున్న శిక్షణ వివరాలను ఇన్‌స్ట్రక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైన్స్‌ ల్యాబ్‌, లైబ్రరీ, రీడింగ్‌ హాల్‌ను పరిశీలించి విద్యార్థుల వినియోగంపై ఆరా తీశారు. స్కూల్‌ లెడ్‌ క్లబ్‌లు నిరంతరం నిర్వహించాల ని, డిజిటల్‌ బ్లాక్‌ బోర్డులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి అన్ని సబ్జెక్టుల్లో పట్టుసాధించి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్‌, అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement