పంద్రాగస్టుకు స్మార్ట్‌ రేషన్‌కార్డు | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు స్మార్ట్‌ రేషన్‌కార్డు

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య

భూపాలపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని రేషన్‌కార్డుదారులు అందరికీ నూతన పీడీఎస్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించిన వెంటనే అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ కార్డులు 9,537, ఆహార భద్రత 1,29,960, అన్నపూర్ణ కార్డులు 33 ఉన్నాయి. మొత్తం 1,39,530 రేషన్‌కార్డులు, 3,95,964 మంది లబ్ధిదారులు ఉన్నారు. కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త కార్డులు త్వరలోనే అందనున్నాయి. ఇందుకోసం జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రోజున ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొందరికి కార్డులు అందజేసి అనంతరం మండలాల వారీగా రేషన్‌ డీలర్ల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

లామినేషన్‌ రూపంలో..

లామినేటెడ్‌ (పీవీసీ) రూపంలో అందించనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డు వాటర్‌ ప్రూఫ్‌, క్రెడిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డు పరిమాణంలో ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్‌ కార్డులపై క్యూ ఆర్‌ కోడ్‌తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. కార్డుపై ప్రభుత్వ లోగో, పౌరసరఫరాల శాఖ పేరు ఉంటుంది. ముందు భాగంలో కార్డుదారుడి ఫొటో, వెనుక భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్‌ దుకాణం నంబర్‌, డీలర్‌ వివరాలు, సివిల్‌ సప్‌లై శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌, ఫిర్యాదుల కోసం వెబ్‌సైట్‌ వివరాలు ఉంటాయి. అత్యాధునికతతో తయారు చేసిన ఈ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లబ్ధిదారులకు అందజేయనున్నారు.

మండలం రేషన్‌కార్డులు

భూపాలపల్లి 23,853

చిట్యాల 12,660

గణపురం 12,844

కాటారం 12,910

పలిమెల 2,722

మహాముత్తారం 9,251

మహదేవపూర్‌ 11,416

మల్హర్‌ 9,934

మొగుళ్లపల్లి 12,618

టేకుమట్ల 9,601

రేగొండ 14,639

కొత్తపల్లిగోరి 7,082

మొత్తం 1,39,530

పంపిణీకి సిద్ధం చేస్తున్న అధికారులు

జిల్లాలో 1,39,530 కార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement