నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మద్యపానం, ఇతర వ్యసనాలతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. వ్యసనాల నిర్మూలన కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని వ్యసన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, జిల్లా సమాచార అధికారి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి ఇందిరా, సుకీర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement