● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు.


