రామప్ప అద్భుతం | - | Sakshi
Sakshi News home page

రామప్ప అద్భుతం

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

లక్నవరంలో సందడి

మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు.

వెంకటాపురం(ఎం): రామప్ప దేవా లయం అద్భుత కట్టడమని సెంట్ర ల్‌ జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ రాకేష్‌ గోయల్‌ కొనియాడారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమా శంకర్‌ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు.

గోవిందరావుపేట: లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సె ల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ స భ్యులు, యువత ఉత్సాహంగా గడిపా రు. సరస్సులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో అధికారులు బోటింగ్‌ను నిలిపివేశారు.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement