సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

సీఐ కరుణాకర్‌ రావు

రేగొండ: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కరుణాకర్‌ రావు సూచించారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్‌ బాధితులు 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్‌ ఎస్సై హేమ, సర్పంచ్‌ చల్లగురుగుల సుదర్శన్‌, ఉప సర్పంచ్‌ ఆకుతోట తిరుపతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement