కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని ప్రాకార దేవతామూర్తుల విగ్రహాల ను తమిళ శిల్పులు తొలగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్‌ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన 50కిపైగా విగ్రహా లను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 23న హైదరాబాద్‌లో టెండర్లు పూర్తి కానున్నట్లు సమాచారం. అనంతరం ఆలయాల కూల్చివేతలు ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే రాతితో కట్టడాల నమూనా చిత్రాలను కమిషనర్‌ హనుమంతరావు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement