విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

చిట్యాల: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరా లకు చేరుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. చల్లగరిగ జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులు, మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలకు రావాలని చెప్పారు. విద్యతో పాటు క్రీడలలో రాణించి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించేందుకు లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్‌, తహసీల్దార్‌ వ సంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, ఎంఈఓ కొడెపాక రఘుపతి, సర్పంచ్‌ జంపయ్య పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న రాహుల్‌ శర్మ

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement