అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు..

న్యూస్‌రీల్‌

అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్‌ జిల్లా కూడా నిలిచింది.

ములుగు ఎందుకు ప్రత్యేకమంటే..

ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్‌ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ గణనీయం

అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలు

ఉమ్మడిజిల్లాకు గ్రీన్‌ కవచం ములుగు అటవీ సంపద

మూడు జిల్లాలకు పర్యావరణ గండం

పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం

ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు,

వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి.

– డాక్టర్‌ కె.పురుషోత్తం, రిటైర్డ్‌ డీఎఫ్‌ఓ, పర్యావరణ నిపుణుడు

హనుమకొండ

మహబూబాబాద్‌

ములుగు

వరంగల్‌

భూపాలపల్లి

జనగామ

భౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ)

అటవీ విస్తీర్ణం (చ.కి.మీ)

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

భూపాలపల్లి: నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విక్రయదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. ఎరువులు, విత్తనాల విక్రయాలు, మ్యాపింగ్‌, రైతు రిజిస్ట్రీ తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 38 రైతు వేదికల ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు 15 రైతు వేదికల మ్యాపింగ్‌ పూర్తయిందని, మిగిలిన 23 రైతు వేదికల మ్యాపింగ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విక్రయాలు ప్రారంభించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాల వద్ద పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రతి విక్రయ కేంద్రంలో మండల స్థాయి అధికారి మరియు పోలీసు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్‌, జిల్లాలో ప్రస్తుత నమోదు కేవలం 66.77 శాతం మాత్రమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన శాతాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఏఓ బాబురావు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్‌, ఏడీఏలు రమేష్‌, శ్రీపాల్‌, ఏఓలు పాల్గొన్నారు.

టీం వర్క్‌తో జిల్లా ప్రగతి పథం..

ఒక టీమ్‌ వర్క్‌గా పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి జూన్‌ 16వ తేదీతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, డీపీఆర్‌ఓ శీలం శ్రీనివాస్‌, ఏఓ శ్రీనివాసులు, డీటీ షఫీ సర్కార్‌, జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ రాహుల్‌ శర్మకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement