ఫీజుల మోత.. | - | Sakshi
Sakshi News home page

ఫీజుల మోత..

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

నిబంధనలు ఇవీ..

భూపాలపల్లి అర్బన్‌: వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాఠశాలల్లో నిబంధనలు పాటించకుండా, బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను చేరవేయటంతో పాటు కొన్ని యజమాన్యాలు ఆ బస్సుల ఫిట్‌నెస్‌ను, సంరక్షకుల నియామకాన్ని పట్టించుకోవటంలేదు. వారు చెప్పిన చోటే నోట్‌ పుస్తకాలు, యూనిఫాంలు బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. అర్హత లేనివారితో విద్యాబోధన చేయిస్తున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం ప్రయోగశాల, గ్రంఽథాలయం, ఆటస్థలాలు లేని పాఠశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి.

75 ప్రైవేట్‌ పాఠశాలలు..

జిల్లాలో 75 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్‌ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్‌కేజీ విద్యార్థులకు ఫీజు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులను కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవే పుస్తకాలు రూ.10 నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. ఈ అమ్మకాల విషయంలో కూడా పాఠశాల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్‌ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్‌ డ్రెస్సు, షూస్‌ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలి. వీటన్నింటితోపాటు పాఠశాల గుర్తింపు కార్డుకు ప్రత్యేక రుసుంతో అమ్మకాలు సాగిస్తున్నారు. పుస్తకాలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.

ప్రైవేట్‌ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి

భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి

విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌

ఉండాలి

తాగునీటి వసతి, ప్రథమ చికిత్స,

కంప్యూటర్‌ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి.

విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్‌,

డీఎడ్‌ పూర్తి చేసిన వారు బోధన చేయాలి.

తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి.

పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం

కల్పించాలి.

పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్‌ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి.

ప్రైవేట్‌ పాఠశాలల్లో వసూళ్లు

భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు

పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement