రేపు సమావేశం | - | Sakshi
Sakshi News home page

రేపు సమావేశం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలో ఈ నెల 19న నిర్వహించనున్న ట్రైపార్టైట్‌ సేఫ్టీ రివ్యూ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏరియా సింగరేణి సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ (డీజీఎంఎస్‌) ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద నివారణ చర్యలు, కార్మికులకు అందిస్తున్న భద్రతా పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యసాధనకు అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, వివిధ గనులు, విభాగాల అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కై లాపూర్‌ పాఠశాల

పునఃప్రారంభం

చిట్యాల: మండలంలోని కై లాపూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థు కొరతతో గతేడాది మూతబడింది. గ్రామస్తుల చొరవతో బుధవారం పునఃప్రారంభమైంది. గ్రామంలో పాఠశాల మూతపడడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గమనించిన గ్రామస్తులు తిరిగి పాఠశాల తెరుచుకునే విధంగా సర్పంచ్‌ కొడారి ఓదేలు, ఉపాధ్యాయుడు దశరథం, గ్రామస్తులు పలు చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాలకు 20 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌ పల్లి పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

చర్యలు తీసుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం డీఈఓ రాజేందర్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేరెళ్ల జోసఫ్‌ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, టీచర్‌ క్వాలిఫికేషన్‌ నోటీస్‌ బోర్డు లో పెట్టాలని కోరారు. ప్రైవేట్‌ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్‌, టై బెల్టు అమ్మకాలు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్న పాఠశాలలను వెంటనే సీజ్‌చేయాలని కోరారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

టేకుమట్ల: సుబ్బక్కపల్లి చలివాగు నుంచి మంగళవారం రాత్రి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్లు రాసమల్ల మల్లయ్య, సుంకరి రాజు, ఆనందపు రాజేందర్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement