నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

మహాముత్తారం: వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు డీలర్లు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు అన్నారు. బుధవారం బోర్లగూడెం రైతువేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్‌ షాప్‌ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహదేవపూర్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్‌ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనూష, వ్యవసాయ విస్తరణ అధికారులు శివకృష్ణ, శశివర్దన్‌ పాల్గొన్నారు.

ఎరువుల దుకాణం తనిఖీ..

మండలంలో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం బోర్లగూడెం గ్రామంలోని మూక్‌లోత్‌ మేగ్య సమ్మయ్య ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్‌ తనిఖీ చేశారు. లైసెన్స్‌, ఈ పాస్‌ బిల్‌బుక్స్‌, స్టాక్‌రిజిస్టర్‌, ఇన్వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు యూరియూ క్రయవిక్రయాలు జరుపరాదని ఆదేశాలిచ్చారు.

జిల్లా వ్యవసాయాధికారి బాబురావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement